breaking news
Rashtriya Samaj Paksha
-
మా పార్టీకి కార్యకర్తలు కావలెను!
ముంబై: కార్యకర్తల కోసం ఓ రాజకీయ పార్టీ పత్రికలో ప్రకటన ఇచ్చిన అరుదైన ఘటన మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలో చోటుచేసుకుంది. ఫడ్నవీస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న మహదేవ్ జంకర్ నేతృత్వంలోని రాష్ట్రీయ సమాజ్ పక్ష(ఆర్ఎస్పీ) ఈ మేరకు ఓ మరాఠీ పత్రికలో కార్యకర్తల కోసం ప్రకటన వెలువరించింది. ‘ఓ జాతీయ పార్టీ కోసం కార్యకర్తలు కావాలి. సామాజిక సేవతో పాటు భారత్, మహారాష్ట్ర అభివృద్ధిని కోరుకునే వ్యక్తులు అయ్యుండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 21న పార్టీ జిల్లా కార్యాలయంలో హాజరుకావాలి’ అని ఆర్ఎస్పీ బుల్ధానా జిల్లా చీఫ్ సుభాష్ రాజ్పుత్ ప్రకటన ఇచ్చారు. సుభాష్ మీడియాతో మాట్లాడుతూ అంకిత భావం, విశ్వాసం కలిగిన కార్యకర్తల కోసమే ప్రకటన ఇచ్చినట్లు తెలిపారు. -
'నెక్ట్స్ సీఎం ఎవరో మేం డిసైడ్ చేస్తాం'
షిరిడి: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలన్నది తమ పార్టీ డిసైడ్ చేస్తుందని రాష్ట్రీయ సమాజ్ పక్ష (ఆరెస్పీ) చీఫ్ మహదేవ్ జనకర్ వ్యాఖ్యానించారు. షిరిడిలోని ప్రఖ్యాత సాయి ఆలయాన్ని మంగళవారం ఆయన దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ ఆరెస్పీ కచ్చితంగా 25కు పైగా సీట్లును కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు.సీఎంగా దేవెంద్ర ఫడ్నవీస్ ఉంటారా, లేక ఉద్దవ్ ఠాక్రే ఆ స్థానంలోకి వస్తారా అన్నది తమ పార్టీ ఫలితాలే నిర్ణయిస్తాయని పేర్కొన్నారు. సీఎం సీటుని తామ పార్టీ నిర్ణయించబోతుందని పేర్కొంటూనే ప్రస్తుత ముఖ్యమంత్రి దేవెంద్ర ఫడ్నవీస్ ను ప్రశంసించారు. రాజుకు సామర్థ్యం ఉన్నట్టయితే గుర్రాన్ని ఎలాగైనా పరుగెత్తించగలడంటూ వ్యాఖ్యానించారు. ఎంపీ సుప్రియ సులేను వచ్చే ఎన్నికల్లో ఓడిస్తామని ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్ర బడ్జెట్ లో రైతుల కోసం 28,000 కోట్లు కేటాయింపులు జరిగాయని అయితే, అధికారులకు-మంత్రులకు మధ్య సమన్వయలోపాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.