యూపీఎస్‌సీ వెబ్‌సైట్‌ హ్యాక్‌ : డోరేమాన్‌ పిక్‌ అప్‌

UPSC Website Hacked - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్‌సీ) హ్యాకింగు గురైంది. దీంతో యూజర్లు తీవ్ర గందరగోళంలో పడ్డారు.  వెబ్‌సైట్  ఓపెన్‌ చేయగానే ప్రముఖ జపనీస్ కార్టూన్ పాత్ర డోరేమాన్‌ కార్టూన్‌ పిక్‌ అప్‌ ది కాల్‌... ఐ యామ్‌ స్టీవ్డ్ అనే  డైలాగ్‌ దర్శనమిచ్చింది. డోరేమాన్‌ కార్టూన్‌ సీరియల్‌ హిందీ పాట వినిపించడంతో నెటిజన్లు మండిపడుతున్నారు.  మరికొంతమంది వినియోగదారులు ట్విట్టర్లో వెబ్‌ సైట్‌ స్క్రీన్‌ షాట్లను షేర్‌ చేయడంతో ఈ  సంఘటన వెలుగులోకి వచ్చింది. సోమవారం రాత్రి   ఈ ఉదంతం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయానికి వెబ్‌సైట్‌ను పునరుద్ధరించారు.అయితే యూపీ ఎస్‌సీ ఇంకా స్పందించాల్సి ఉంది. 

కాగా  ప్రభుత్వ వెబ్‌సైట్లు హ్యాక్‌ కావడం ఇది మొదటిసారి కాదు. ఈ ఏడాది ఏప్రిల్లో బ్రెజిల్ హాక్ టీమ్ ద్వారా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌ హ్యాక్ అయింది. గత సంవత్సరంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ (ఐఐటీ ఢిల్లీ), ఐఐటీ వారణాసి, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఎమ్యు), ఢిల్లీ యూనివర్శిటీ (డీయూ) వంటి వెబ్‌సైట్లను పాకిస్తాన్‌ అనుకూల సంస్థ  హ్యాక్ చేసిన సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top