breaking news
DoreMan
-
యూపీఎస్సీ వెబ్సైట్ హ్యాక్
సాక్షి, న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్సీ) హ్యాకింగు గురైంది. దీంతో యూజర్లు తీవ్ర గందరగోళంలో పడ్డారు. వెబ్సైట్ ఓపెన్ చేయగానే ప్రముఖ జపనీస్ కార్టూన్ పాత్ర డోరేమాన్ కార్టూన్ పిక్ అప్ ది కాల్... ఐ యామ్ స్టీవ్డ్ అనే డైలాగ్ దర్శనమిచ్చింది. డోరేమాన్ కార్టూన్ సీరియల్ హిందీ పాట వినిపించడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. మరికొంతమంది వినియోగదారులు ట్విట్టర్లో వెబ్ సైట్ స్క్రీన్ షాట్లను షేర్ చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. సోమవారం రాత్రి ఈ ఉదంతం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయానికి వెబ్సైట్ను పునరుద్ధరించారు.అయితే యూపీ ఎస్సీ ఇంకా స్పందించాల్సి ఉంది. కాగా ప్రభుత్వ వెబ్సైట్లు హ్యాక్ కావడం ఇది మొదటిసారి కాదు. ఈ ఏడాది ఏప్రిల్లో బ్రెజిల్ హాక్ టీమ్ ద్వారా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ హ్యాక్ అయింది. గత సంవత్సరంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ (ఐఐటీ ఢిల్లీ), ఐఐటీ వారణాసి, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఎమ్యు), ఢిల్లీ యూనివర్శిటీ (డీయూ) వంటి వెబ్సైట్లను పాకిస్తాన్ అనుకూల సంస్థ హ్యాక్ చేసిన సంగతి తెలిసిందే. UPSC website hacked . @IndianCERT @NICMeity @IndianExpress pic.twitter.com/mLx8bR4iVj — kuldeep nagar (@kuldeepnagar5) September 10, 2018 is #upsc site hacked??? When i try to open it display's doraemon picture. @PMOIndia @ZeeNews pic.twitter.com/mblf3NlRyv — Yashpratap kantharia (@Yashpratap96) September 10, 2018 The website of UPSC has been hacked!!😳😳 pic.twitter.com/OFpHy9k56t — Ruchika Chaubey (@chaubeyruchii) September 10, 2018 -
డోరేమాన్ చెవులేమయ్యాయి?
డోరేమాన్... పిల్లిలా కనిపిస్తుంది. పిల్లి కాదు. మరబొమ్మలా ఉంటుంది. కానీ మనిషిలా స్పందిస్తుంది. మనిషికంటే ఎక్కువ శక్తులున్నట్లు వ్యవహరిస్తుంది. ఈ పాత్ర ఇప్పటికి కాదు, భవిష్యత్తు కాలానిది. నిజమే డోరేమాన్ పుట్టిన రోజు 2112వ సంవత్సరం, 9వ నెల, 3 తేదీ. డోరేమాన్ బరువు సుమారు 130 కిలోలు. పొడవు 130 సెంటీమీటర్లు. గంటకు నూట ముప్పై కిలోమీటర్ల దూరం పరుగెడుతుంది. ఇంతకీ దీనికి ఒక లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటుంది తెలుసా? మీరు ఊహించింది నిజమే! డోరేమాన్కి చెవులుండవు. ఆ చెవులను ఎలుక కొరికేసింది. అందుకే డోరేమాన్కి ఎలుకలంటే కోపం, భయం కూడా. డోరేమాన్కు ఇష్టమైన ఆహారం డోరాయాకీ. తియ్యని గింజలతో చేసిన పేస్టును బన్నులో కూరితే అదే డోరాయాకీ. ఇంతకీ భవిష్యత్తులో ఎప్పుడో... పుట్టాల్సిన డోరేమాన్ ఇప్పుడెందుకు కనిపిస్తోందంటారా? తాతగారి కోసం వర్తమానంలోకి వచ్చి జీవిస్తుంటుంది. ఇంతకీ ఆ తాత ఎవరో తెలుసా? మనకు డోరేమాన్లో తప్పనిసరిగా కనిపించే అబ్బాయి నోబిత.