ఢిల్లీలో క్యాబ్ డ్రైవర్ అరాచకం | Uber Cab Driver Arrested For Allegedly Molesting Woman Journalist | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో క్యాబ్ డ్రైవర్ అరాచకం

Jan 22 2016 9:19 AM | Updated on Aug 30 2018 9:02 PM

ఢిల్లీలో క్యాబ్ డ్రైవర్ అరాచకం - Sakshi

ఢిల్లీలో క్యాబ్ డ్రైవర్ అరాచకం

దేశ రాజధాని ఢిల్లీలో ఉబెర్ క్యాబ్ డ్రైవర్ ఓ మహిళా జర్నలిస్టు పట్ల అసభ్యంగా ప్రవర్తించి, వేధించాడు.

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రెండేళ్ల క్రితం ఉబెర్ క్యాబ్ డ్రైవర్ ఓ మహిళపై అత్యాచారం చేసిన ఘటన దేశాన్ని కుదిపేయగా, తాజాగా ఉబెర్ సంస్థకే చెందిన మరో డ్రైవర్ ఓ మహిళా జర్నలిస్టు పట్ల అసభ్యంగా ప్రవర్తించి, వేధించాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

డీఎస్పీ విజయ్ ధూల్ చెప్పిన వివరాల మేరకు.. బుధవారం రాత్రి ఢిల్లీ నుంచి గుర్గావ్ వెళ్లేందుకు బాధిత మహిళా జర్నలిస్టు క్యాబ్ మాట్లాడుకున్నారు. నోయిడా సెక్టార్ 15 మెట్రో స్టేషన్ సమీపంలో క్యాబ్ డ్రైవర్ రవీందర్ సింగ్ రాంగ్ రూట్ తీసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన మహిళ జర్నలిస్టు వెంటనే కారును ఆపించి దిగేశారు. ఆమె నడుచుకుంటూ ఇంటికి బయల్దేరింది. అయితే కారు డ్రైవర్ ఆమెను వెంటాడి వేధించాడు. ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. బాధితురాలు వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్కు ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement