సీబీఐ డైరెక్టర్ నియామకానికి.. ఇద్దరు చాలు! | two of three can decide cbi director appointment, says amended law | Sakshi
Sakshi News home page

సీబీఐ డైరెక్టర్ నియామకానికి.. ఇద్దరు చాలు!

Nov 26 2014 2:26 PM | Updated on Aug 20 2018 9:16 PM

సీబీఐ డైరెక్టర్ నియామకానికి.. ఇద్దరు చాలు! - Sakshi

సీబీఐ డైరెక్టర్ నియామకానికి.. ఇద్దరు చాలు!

సీబీఐ డైరెక్టర్ నియామకంలో సవరణల బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించింది.

సీబీఐ డైరెక్టర్ నియామకంలో సవరణల బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించింది. తాజా బిల్లు ప్రకారం, సీబీఐ డైరెక్టర్ నియామకాన్ని ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్సభలో ప్రతిపక్షనేత కలిసి నిర్ణయిస్తారు. అయితే, ఇందులో ఏ ఒక్కరు గైర్హాజరైనా.. మిగిలిన ఇద్దరు కలిసి నియామకం చేయొచ్చని కేంద్రం తెలిపింది.

అయితే, ఈ నిబంధనపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల పదవులు ఎప్పుడూ ఖాళీగా ఉండబోవని కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకునే ఈ నిబంధన పెట్టారని ఆయన విమర్శించారు. ఇప్పటీకీ ప్రతిపక్ష నేతను ప్రభుత్వం గుర్తించలేదని, కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ఆయన అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement