breaking news
cbi appointment
-
హైదరాబాద్లో హైటెన్షన్.. కవిత సీబీఐ విచారణపై సస్పెన్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పాలిటిక్స్ మరోసారి రసవత్తరంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కాం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో భాగంగా ఎమ్మెల్సీ కవితను సీబీఐ విచారించనున్న నేపథ్యంలో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. అయితే, తాజాగా ఎమ్మెల్సీ కవిత.. సీబీఐ విచారణపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతున్నది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నేడు(మంగళవారం) కవితను విచారిస్తామని గతంలో సీబీఐ నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. కాగా, మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని 160 సీఆర్పీసీ కింద నోటీసులు పంపించారు సీబీఐ అధికారులు. ఈ క్రమంలో తాను మంగళవారం అందుబాటులో ఉండటం లేదని విచారణకు హాజరుకాలేనని సీబీఐకి లేఖ రాశారు. మరోవైపు.. విచారణ నిమిత్తం సీబీఐ అధికారులు కోఠిలోని ఆఫీసుకు ఇప్పటికే చేరుకున్నారు. ఇదిలా ఉండగా.. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోకి సీబీఐకి అనుమతిలేదని ఇప్పటికే సర్కార్ జీవో 56 విడుదల చేసింది. ఈ తరుణంలో కవితను విచారించాలంటే సీబీఐ అధికారులు తప్పనిసరిగా కోర్టు అనుమతి తీసుకోవాలని న్యాయనిపుణులు చెబుతున్నారు. దీంతో, కవిత విచారణ విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరోవైపు.. సీబీఐకి రాసిన లేఖలో కవిత.. ఈనెల 11, 12, 14, 15 తేదీన విచారించేందుకు సమయం కోరారు. సీబీఐ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. -
సీబీఐ డైరెక్టర్ నియామకానికి.. ఇద్దరు చాలు!
సీబీఐ డైరెక్టర్ నియామకంలో సవరణల బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించింది. తాజా బిల్లు ప్రకారం, సీబీఐ డైరెక్టర్ నియామకాన్ని ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లోక్సభలో ప్రతిపక్షనేత కలిసి నిర్ణయిస్తారు. అయితే, ఇందులో ఏ ఒక్కరు గైర్హాజరైనా.. మిగిలిన ఇద్దరు కలిసి నియామకం చేయొచ్చని కేంద్రం తెలిపింది. అయితే, ఈ నిబంధనపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల పదవులు ఎప్పుడూ ఖాళీగా ఉండబోవని కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకునే ఈ నిబంధన పెట్టారని ఆయన విమర్శించారు. ఇప్పటీకీ ప్రతిపక్ష నేతను ప్రభుత్వం గుర్తించలేదని, కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ఆయన అన్నారు.