డ్యాన్స్‌ చేస్తూ.. ట్రాఫిక్‌ కంట్రోల్‌ చేస్తాడు | Traffic Police Uses His Dance To Control Traffic In Odisha | Sakshi
Sakshi News home page

ఈ ట్రాఫిక్‌ పోలీసు కొంచెం డిఫరెంట్ గురూ..

Sep 11 2018 4:56 PM | Updated on Sep 11 2018 8:36 PM

Traffic Police Uses His Dance To Control Traffic In Odisha - Sakshi

భువనేశ్వర్‌ : ట్రాఫిక్‌ కంట్రోల్‌ చేయడం ఎంత కష్టమో అందరికి తెలిసిందే. వాహనదారులను అదుపు చేయడంలో ట్రాఫిక్‌ పోలీసులు పడే బాధ అంత ఇంత కాదు. ఒక్కోసారి వారి సూచనలు పట్టించుకోకుండా వాహనదారులు దొడ్డిదారిన వెళ్తునే ఉంటారు. వారిని అదుపు చేయడానికి ట్రాఫిక్‌ పోలీసులు నానా కష్టాలు పడుతుంటారు. కానీ ఈ ట్రాఫిక్‌ పోలీస్‌కి మాత్రం అలాంటి కష్టాలు లేవు. డ్యాన్స్‌తో ట్రాఫిక్‌ కంట్రోల్‌ చేస్తాడు. పేరు ప్రతాప్‌ చంద్ర ఖండ్వాల్‌. భువనేశ్వర్‌లో విధులు నిర్వహిస్తున్నారు.అదిరిపోయే స్టెప్పులేసి ట్రాఫిక్‌ను మేనేజ్‌ చేస్తాడు.

గతంలొ హొంగార్డుగా విధులు నిర్వహించిన ప్రతాప్‌ ఇటీవలే ట్రాఫిక్‌ పోలీసుగా నియమితులయ్యారు. అయితే ట్రాఫిక్‌ పోలీసు విధులు నిర్వహించడం ప్రతాప్‌కి కొత్త కావడంతో.. మనోడి ఆజ్ఞను వాహనదారులెవరూ పట్టించుకోలేదట. దీంతో చిరాకు చెందిన ప్రతాప్‌ కొంచెం ఢిపెరెంట్‌గా ఆలోచించాడు.

వాహనదారులను అదుపు చేయడం కోసం రోడ్డు మీదే డాన్స్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో వాహనదారులు మనోడి డాన్స్‌కు ఫిదా అయిపోయి వాహనాలను ఆపుతున్నారు. అలా ట్రాఫిక్ కంట్రోల్ అవుతుండటంతో ఇక డాన్స్‌తోనే ట్రాఫిక్‌ను కంట్రోల్‌ చేయడం ప్రారంభించాడు. కాగా ప్రతాప్‌ డాన్స్ చేస్తూ ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తుండగా ఓ వాహనదారుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. మనోడి డ్యాన్స్‌ మీరు కూడా చూడండి..

Advertisement
 
Advertisement
Advertisement