రాజధానిలో భారీ ట్రాఫిక్‌ జామ్‌, కారణం?

Traffic Jam at Delhi-Gurugram Broader After Haryana Seals The Border - Sakshi

చంఢీఘర్‌: ఢిల్లీ-గురుగ్రామ్‌ బోర్డ్‌లో శుక్రవారం భారీ ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. గురువారం హర్యానా ప్రభుత్వం అన్ని బోర్డర్‌లను మూసివేస్తూ నిర్ణయం తీసుకోవడంతో వాహనాలు ఎక్కడిక్కడ ఆగిపో​యాయి. ఢిల్లీ బోర్డర్‌లో ఉన్న జిల్లాల నుంచే కరోనా రాష్ట్రంలోకి వ్యాప్తిస్తోందని భావించిన హర్యానా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

ఈ విషయం గురించి హర్యానా హోం మినిస్టర్‌ అనిల్‌ విజ్‌ మాట్లాడుతూ...‘ఢిల్లీ సరిహద్దు కలిగిన జిల్లాల్లో కరోనా కేసులు సంఖ్య గత వారం నుంచి విపరీతంగా పెరిగింది. అందుకే గురువారం నుంచి ఢిల్లీతో సంబంధం ఉండే అన్ని బోర్డర్‌లను సీజ్‌ చేశాం. ఇకపై సరియైన కారణంగా లేకుండా ఢిల్లీ సరిహద్దు నుంచి ఎవరని రాష్ట్రంలోకి అనుమతించాం. రాష్ట్రంలో 8 శాతం కరోనా కేసులు ఢిల్లీ సరిహద్దుగా ఉన్న జిల్లాల నుంచే నమోదయ్యాయి. అందుకే ఢిల్లీ-గురుగ్రామ్‌ బోర్డర్‌ను సీజ్‌ చేశాం’ అని తెలిపారు. 

గురగ్రామ్‌, ఫరీదాబాద్‌, సోనిపట్‌, జజ్జార్‌లోనే హర్యానా మొత్తం మీద ఎక్కువ కేసులు నమోదయ్యాయి. గురువారం గురుగ్రామ్‌లో 68 కేసులు నమోదు కాగా, ఫరీదాబాద్‌లో 18, సోనిపట్‌లో 4 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా గురుగ్రామ్‌లో 405 కేసులు, ఫరీదాబాద్‌లో 276, సోనిపట్‌లో 180, జజ్జర్‌లో 97 కేసులు నమోదయ్యాయి. శుక్రవారం నాటికి భారత్‌లో 1,65,799 కేసులు నమోదు కాగా, గడిచిన 24 గంటల్లోనే దేశంలో రికార్డుస్థాయిలో 7,466 కేసులు నమోదయ్యాయి. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top