యాసిడ్‌ వీడియోపై మ‌హిళా క‌మిష‌న్ ఫైర్‌ | Tiktok Star Faizal Siddiqui In Trouble After Shares Acid Attack Video | Sakshi
Sakshi News home page

పిచ్చి వేషాలు వేసేవారికి లైకులు, ఫాలోవ‌ర్లు

May 18 2020 3:43 PM | Updated on May 18 2020 4:57 PM

Tiktok Star Faizal Siddiqui In Trouble After Shares Acid Attack Video - Sakshi

న్యూఢిల్లీ: ఏది  చేసినా చెల్లుతుందనుకున్న టిక్‌టాక్ స్టార్‌కు గ‌ర్వ‌భంగ‌మైంది. అత‌ని చేష్టలుడిగిన‌ వీడియోల‌కు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన జాతీయ మ‌హిళా కమిష‌న్ అత‌ని టిక్‌టాక్ వీడియోతోపాటు అకౌంట్‌ను కూడా తొల‌గించాల‌ని స‌ద‌రు సంస్థ‌ను ఆదేశించింది. వివ‌రాల్లోకి వెళితే.. ఫైజ‌ల్ సిద్దిఖీ ఓ టిక్‌టాక్ స్టార్. అత‌నికి కోటి ముప్పై ల‌క్ష‌ల మందికి పైగా ఫాలోవ‌ర్లు ఉన్నారు. అత‌ను వీడియో అప్‌లోడ్ చేసిన కొద్ది గంట‌ల్లోనే లైక్స్ వేలు, ల‌క్ష‌లు దాటిపోతాయి. అయితే తాజాగా అత‌ను చేసిన వీడియో వివాదాస్ప‌ద‌మైంది. ఇందులో త‌న ప్రేమ‌కు య‌స్ చెప్ప‌ని అమ్మాయిపై యాసిడ్ పోస్తాడు. ఇది హింస‌ను ప్రేరేపించే విధంగా ఉండ‌టంతో ఈ టిక్‌టాక్ వీడియోపై నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. (‘టిక్‌టాక్‌’ కలిపింది )

ఇలాంటి కంటెంట్‌ను అనుమ‌తించినందుకు టిక్‌టాక్ సంస్థ‌ను ఏకిపారేస్తున్నారు. "ఇలా పిచ్చి వేషాలు వేసేవారికి లైకులు, ఫాలోవ‌ర్లు" అంటూ మ‌రికొందరు విమ‌ర్శిస్తున్నారు. ఈ వీడియో గురించి తెలుసుకున్న జాతీయ మ‌హిళా క‌మిష‌న్ మ‌హిళ‌ల‌పై హింస‌ను ప్రేరేపిస్తున్న‌ ఫైజ‌ల్ సిద్దిఖీ యాసిడ్‌ వీడియో స‌హా, అత‌ని అకౌంట్‌ను తొల‌గించాల‌ని టిక్‌టాక్ సంస్థ‌ను ఆదేశించింది. కాగా గ‌తంలోనూ మ‌హిళ‌ల హ‌క్కుల‌కు భంగం క‌లిగించేవిధంగా యాసిడ్ దాడుల‌కు సంబంధించిన వీడియోలు టిక్‌టాక్‌లో ప్ర‌త్య‌క్ష‌మైన సంగ‌తి తెలిసిందే. (ఇల్లునే థియేట‌ర్‌గా మార్చేశాడు)

Advertisement
 
Advertisement
Advertisement