ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదుల హతం | Three Lashkar-e-Taiba terrorists killed in Sopore encounter | Sakshi
Sakshi News home page

ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదుల హతం

Aug 5 2017 9:39 AM | Updated on Sep 11 2017 11:21 PM

జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు.

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. బారాముల్లా జిల్లాలోని సోపోర్‌లో జరిగిన హోరాహోరి కాల్పుల్లో భద్రతాబలగాలు శనివారం ఉదయం ముగ్గురు తీవ్రవాదులను హతమార్చాయి. కాగా ఉగ్రవాదుల ఎదురు కాల్పుల్లో ఓ జవాను గాయపడ్డాడు. 

ఘటనా స్థలంలో మూడు ఏకే 47 గ‌న్ల‌ను భ‌ద్ర‌తా బ‌ల‌గాలు స్వాధీనం చేసుకున్నాయి. మరోవైపు ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో సోపోర్‌లో ప్రభుత్వ, ప్రయివేట్‌ పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించినట్లు అడిషనల్‌ డిప్యూటీ కమిషనర్‌ తెలిపారు. అలాగే ముందుజాగ్రత్త చర్యగా బారాముల్లా జిల్లాలో ఇంటర్‌నెట్‌ సర్వీసులు నిలిపివేశారు. సీఆర్‌పీఎఫ్‌, ఎస్‌వోజీ దళాలు జాయింట్‌ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.

 

Advertisement
 
Advertisement
Advertisement