ఏసీ పేలి ముగ్గురు దుర్మరణం | Three of a family charred to death in AC blast | Sakshi
Sakshi News home page

ఏసీ పేలి ముగ్గురు దుర్మరణం

May 16 2019 8:22 AM | Updated on May 16 2019 8:23 AM

Three of a family charred to death in AC blast - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: ఏసీ పేలడంతో మంటలంటుకుని ముగ్గురు అగ్నికి ఆహుతయ్యారు. ఈ దుర్ఘటన తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో మంగళవారం జరిగింది. ప్రమాదంలో ముగ్గురు మరణించారు. దిండివనంకు చెందిన రాజు (60), అతని భార్య కలైసెల్వి, రెండో కొడుకు గౌతమ్‌ పడకగదిలో నిద్రిస్తుండగా మూడు గంటల సమయంలో బెడ్‌రూమ్‌లోని ఏసీ పేలింది.

దీంతో ఒక్కసారిగా మంటలు, దట్టంగా పొగ గది అంతా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని గది తలుపులు పగులగొట్టారు. కానీ, అప్పటికే తీవ్రంగా కాలిన గాయాలతో రాజు, అతని భార్య, కొడుకు ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. అగ్నికి ఆహుతైన గౌతమ్‌కు మరో 20 రోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా ఈ దారుణానికి బలైపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement