మధురై ప్రభుత్వ ఆస్పత్రిలో విషాద ఘటన

three die in Madurai government hospital due to power cut  - Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడు మధురై ప్రభుత్వ ఆస్పత్రిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విద్యుత్‌ సరఫరా నిలిచి పోవడంతో ఇంటెన్సివ్‌ కేర్‌లో వెంటిలేరట్‌పై చికిత్స పొందుతున్న అయిదుగురు రోగులు  ఊపిరి ఆడక మృతి చెందారు. మరో అయిదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత రెండు రోజులుగా మధురైలో కురుస్తున్న వర్షాల కారణంగా విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అయితే ప్రభుత్వ ఆస్పత్రిలో జనరేటర్‌ బ్యాకప్‌ లేకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై ఆస్పత్రి తప్పిదం ఏమీ లేదంటూ డీన్‌ చేతులు దులుపుకున్నారు. కాగా మృతులు మల్లిక (55). రవిచంద్రన్‌ (55)గా గుర్తించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top