'ఉదయం 4 గంటల వరకు కొట్టుకున్నారు' | they quarelled till 4 am on that day, says narayan singh | Sakshi
Sakshi News home page

'ఉదయం 4 గంటల వరకు కొట్టుకున్నారు'

Jan 10 2015 5:42 PM | Updated on Sep 18 2019 3:04 PM

'ఉదయం 4 గంటల వరకు కొట్టుకున్నారు' - Sakshi

'ఉదయం 4 గంటల వరకు కొట్టుకున్నారు'

కేంద్ర మాజీమంత్రి శశి థరూర్.. ఆయన భార్య సునందా పుష్కర్ రాత్రి నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు కొట్టుకున్నారట.

కేంద్ర మాజీమంత్రి శశి థరూర్.. ఆయన దివంగత భార్య సునందా పుష్కర్ మధ్య గొడవలు జరిగేవని అందరికీ తెలుసు. వాటి కారణంగానే ఆమె మరణించారని కూడా తెలుసు. అయితే.. వాళ్లు ఆ ముందురోజు రాత్రి నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు కొట్టుకున్నారని వాళ్ల ఇంట్లో పనిమనిషిగా చేసే నారాయణ్ సింగ్ చెప్పాడు. కేటీ అనే మహిళ పేరు ఆ గొడవలో తరచు వినిపించిందని కూడా అతడు తెలిపాడు.

సునందాపుష్కర్ అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైన రోజున.. థరూర్ దంపతులు ఇంట్లో కాకుండా, ప్రభుత్వం కేటాయించే అధికార నివాసంలో కాకుండా.. లీలాప్యాలెస్ అనే హోటల్లో వాళ్లు ఉన్నారు. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పాల్గొనేందుకు శశి థరూర్ వెళ్లిన తర్వాత అదే రోజు.. అంటే జనవరి 17వ తేదీన సునందా పుష్కర్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. పొలోనియం 210 లాంటి విషపదార్థం కారణంగా ఆమె హత్యకు గురయ్యారని ఎయిమ్స్ వైద్యులు తేల్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపైనే థరూర్ ఇంట్లో పనిచేసే నారాయణ్ సింగ్ వాంగ్మూలం ఇప్పుడు కీలకంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement