విమానంలో బాంబు బెదిరింపు లేఖ లభించిన సంఘటన బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం కలకలం రేగింది.
-జైపూర్ నుంచి వచ్చిన విమానంలో బెదిరింపు లేఖ
దొడ్డబళ్లాపురం(కర్ణాటక)
విమానంలో బాంబు బెదిరింపు లేఖ లభించిన సంఘటన బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం కలకలం రేగింది. జైపూర్ నుంచి నుంచి గోవా వెళ్లాల్సిన ఎయిర్ ఏషియా విమానం బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు 160 మంది ప్రయాణికులతో బెంగళూరు విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది.
విమానాన్ని సిబ్బంది శుభ్రం చేస్తుండగా బాంబు బెదిరింపు లేఖ లభించింది. అందులో 'బాంబ్ ఈజ్ కెప్ట్' అని రాసి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అప్రమత్తమైన బాంబ్ స్వ్కాడ్ సిబ్బంది విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి ఉత్తుత్తి బాంబు బెదిరింపు లేఖగా తేల్చారు. అయితే లేఖ ఎవరు రాశారనే విషయంపై ఎయిర్ పోర్టు సెక్యూరిటీ విభాగం విచారణ చేపట్టింది. ఇదిలా ఉండగా 1.30 గంటలకు ఇక్కడి నుంచి గోవాకు బయల్దేరాల్సిన ఈ విమానం తనిఖీల వల్ల రెండు గంటల ఆలస్యంగా బయల్దేరింది.