మాట వినలేదని మహిళ తలను రెండు చెక్కలు చేసిన ఉగ్రవాదులు | Terrorists kill woman for refusing their ovurtures | Sakshi
Sakshi News home page

మాట వినలేదని మహిళ తలను రెండు చెక్కలు చేసిన ఉగ్రవాదులు

Jun 4 2014 3:09 PM | Updated on Jul 28 2018 8:51 PM

మాట వినలేదని మహిళ తలను రెండు చెక్కలు చేసిన ఉగ్రవాదులు - Sakshi

మాట వినలేదని మహిళ తలను రెండు చెక్కలు చేసిన ఉగ్రవాదులు

ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో ఉగ్రవాదులు బలాత్కారాన్ని ప్రతిఘటించిన ఒక మహిళను ఆమె భర్త, పిల్లల ముందే అత్యంత కిరాతకంగా చంపేశారు.

ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో ఉగ్రవాదులు బలాత్కారాన్ని ప్రతిఘటించిన ఒక మహిళను ఆమె భర్త, పిల్లల ముందే అత్యంత కిరాతకంగా చంపేశారు. ఈ ఘోరం మంగళవారం రాత్రి జరిగింది.
 
గారో నేషనల్ లిబరేషన్ ఆర్మీకి చెందిన అయిదుగురు ఉగ్రవాదులు మేఘాలయలోని రాజా రంగత్ గ్రామంలో ఒక ఇంట్లోకి చొరబడ్డారు. భర్త, పిల్లలన ఒక గదిలో బంధించి, మహిళను బలాత్కరించడానికి ప్రయత్నించారు. ఆమె దానికి తీవ్రంగా ప్రతిఘటించడంతో మెషీన్ గన్ తో ఆమె తలపై దగ్గర నుంచి కాల్చారు. దీంతో ఆమె తల రెండు చెక్కలై అక్కడికకక్కడే చనిపోయింది. 
 
ఈ సంఘటనను ఎంపీ, లోకసభ మాజీ స్పీకర్ పిఎ సంగ్మా తీవ్రంగా ఖండించారు. మేఘాలయలో ఇలాంటి సంఘటన ఇంతకు ముందెన్నడూ జరగలేదని ఆయన అన్నారు. గారో జాతి ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నామని చెప్పుకుంటున్న గారో ఉగ్రవాదులు గారో ప్రజలనే కాల్చి చంపడం స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement