జమ్మూకాశ్మీర్లో శుక్రవారం కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు తమ పవిత్ర గ్రంధం ఖురాన్ను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలువురు ముస్లింలు నిరసనలు తెలిపేందుకు భారీ సంఖ్యలో భదేర్ వాహ్ వీధుల్లోకి వచ్చారు.
జమ్మూ: జమ్మూకాశ్మీర్లో శుక్రవారం కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు తమ పవిత్ర గ్రంధం ఖురాన్ను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలువురు ముస్లింలు నిరసనలు తెలిపేందుకు భారీ సంఖ్యలో భదేర్ వాహ్ వీధుల్లోకి వచ్చారు.
ఈ సందర్భంగా పలు దుకాణాలు మూతపడగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. విద్యాసంస్థలను మూసివేశారు. కొందరు ముస్లిం యువకులు వీధుల్లోకి వచ్చి టైర్లు వేసి నిప్పంటించారు. రహదారులను దిగ్భందించారు. విజయదశమి సంబురాల్లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తమ ఖురాన్ లోని కొన్ని పేజీలను తగులబెట్టారని అక్కడి ముస్లింలు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా శాంతిభద్రతలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు.