బీజాపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ | Ten Maoists killed in Chhattisgarh encounter | Sakshi
Sakshi News home page

బీజాపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

Feb 7 2019 1:07 PM | Updated on Feb 7 2019 2:53 PM

Ten Maoists killed in Chhattisgarh encounter - Sakshi

ఛత్తీస్‌గడ్‌  బీజాపూర్ జిల్లా లో గురువారం భారీ ఎన్ కౌంటర్‌ జరిగింది. మావోయిస్టులు, పోలీసుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో సుమారు..

ఛత్తీస్‌గఢ్‌ : ఛత్తీస్‌గడ్‌లోని  బీజాపూర్ జిల్లా భైరాన్ గడ్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం భారీ ఎన్కౌంటర్‌ జరిగింది. మావోయిస్టులు, పోలీసుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో సుమారు 10మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం.  ఘటనా స్థలం వద్ద భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. కాగా మావోయిస్టుల మృతిని బీజాపూర్ ఎస్పీ మోహిత్‌ గార్గ్‌ అధికారికంగా ధ్రువీకరించారు. కాగా భైరాంగఢ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు భద్రతాదళాలకు సమాచారం అందటంతో ఇంద్రావతి నది సమీపంలోని అబూజ్‌మడ్‌‌ ప్రాంతంలో డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్‌ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో జవాన్లపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతాదళాలు ఎదురుకాల్పులు జరిపి 10 మంది మావోయిస్టులను మట్టుబెట్టాయి. ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నాయి. చనిపోయిన మావోయిస్టుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పోలీసులు చెబుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement