స్విస్ అభ్యంతరాలు చెబుతోంది: జైట్లీ | Swiss objections says: Jaitley | Sakshi
Sakshi News home page

ట అభ్యంతరాలు చెబుతోంది: జైట్లీ

Jul 19 2014 3:12 AM | Updated on Sep 2 2017 10:29 AM

స్విస్ అభ్యంతరాలు చెబుతోంది: జైట్లీ

స్విస్ అభ్యంతరాలు చెబుతోంది: జైట్లీ

అక్రమ బ్యాంకు ఖాతాల జాబితాను ఇవ్వాలని సిట్జర్లాండ్‌ను కోరితే.. ఆ దేశం న్యాయపర అభ్యంతరాలు లేవనెత్తుతోందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు.

న్యూఢిల్లీ: అక్రమ బ్యాంకు ఖాతాల జాబితాను ఇవ్వాలని సిట్జర్లాండ్‌ను కోరితే.. ఆ దేశం న్యాయపర అభ్యంతరాలు లేవనెత్తుతోందని ఆర్థిక  మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. శుక్రవారం లోక్‌సభలో స్విస్ బ్యాంక్ అకౌంట్లపై చర్చలో ఈ విషయం చెప్పారు. అయితే అక్రమ ఖాతాదారులకు సంబంధించి సాక్ష్యాలు సంపాదించేందుకు ఆ దేశం నుంచి ఖాతాల జాబితాను రప్పించడానికి ప్రయత్నిస్తామన్నారు.  స్విస్ అధికారులతో సంప్రదింపుల నేపథ్యంలో ఆ దేశ న్యాయసూత్రాలను అనుసరించి ఒక ఒప్పందం కూడా చేసుకోబోతున్నామని వెల్లడించారు.  స్వభావరీత్యా అది భవిష్యత్ ఖాతాలకు సంబంధించినది కావడంతో గత ఖాతాల వివరాలు వెల్లడించడానికి స్విట్జర్లాండ్ సహకరించడంలేదన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement