ప్రజా ప్రయోజనార్థం టాటా సన్స్‌ను లిస్ట్‌ చేయాలి  | Shapoor Mistry pushes for Tata Sons listing as Tata Trusts | Sakshi
Sakshi News home page

ప్రజా ప్రయోజనార్థం  టాటా సన్స్‌ను లిస్ట్‌ చేయాలి 

Apr 11 2026 3:57 AM | Updated on Apr 11 2026 3:57 AM

Shapoor Mistry pushes for Tata Sons listing as Tata Trusts

ప్రభుత్వం, ఆర్‌బీఐ నిర్ణయంపై నమ్మకం ఉంది

ఎస్‌పీ గ్రూప్‌ చైర్మన్‌ షాపూర్‌జీ పల్లోంజీ మిస్త్రీ

న్యూఢిల్లీ: నిబంధనల అమలు కోణంలోనే కాకుండా ప్రజా ప్రయోజనార్థం కూడా టాటా సన్స్‌ని లిస్ట్‌ చేసి తీరాలని ఎస్‌పీ గ్రూప్‌ చైర్మన్‌ షాపూర్‌జీ పల్లోంజీ మిస్త్రీ స్పష్టం చేశారు. దీని వల్ల కార్పొరేట్‌ గవర్నెన్స్‌ మెరుగుపడి, పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతాయని పేర్కొన్నారు. అలాగే లక్షలాది రిటైల్‌ వాటాదారులకు గణనీయంగా విలువ చేకూరుతుందని, మరింత మంది పేద వర్గాలకు తోడ్పాటు అందించేలా టాటా ట్రస్ట్స్‌కి కూడా భారీగా డివిడెండు లభించగలదని మిస్త్రీ చెప్పారు. 

ఈ విషయంలో ప్రభుత్వం, ఆర్‌బీఐ నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తాయని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. టాటా సన్స్‌ని లిస్ట్‌ చేయడాన్ని వ్యతిరేకిస్తున్న వారు దాని లిస్టింగ్‌ వల్ల టాటా ట్రస్ట్స్‌ ప్రయోజనాలు ఏ విధంగా దెబ్బతింటాయి, లబి్ధదారులకు సేవలందించడంలో సామర్థ్యాలు ఎలా తగ్గిపోతాయనే దానిపై ఇప్పటివరకూ రుజువులతో కూడుకున్న ఆధారాలేవీ చూపలేదని ఆయన పేర్కొన్నారు. 

టాటా సన్స్‌ లిస్టింగ్‌కి టాటా ట్రస్ట్స్‌లోని ఇద్దరు ట్రస్టీలు (వేణు శ్రీనివాసన్, విజయ్‌ సింగ్‌) అనుకూలంగా ఉన్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో మిస్త్రీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, టాటా ట్రస్ట్‌ చైర్మన్‌ నోయెల్‌ టాటా మాత్రం లిస్టింగ్‌ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. టాటా సన్స్‌లో 66 శాతం వాటా ఉన్న టాటా ట్రస్ట్స్‌ ట్రస్టీల మధ్య గతేడాది అక్టోబర్‌లో అంతర్గత పోరు తెరపైకి వచ్చిన తరుణంలో దాన్ని స్టాక్‌ ఎక్సే్చంజీల్లో లిస్ట్‌ చేయాలంటూ మిస్త్రీ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. టాటా సన్స్‌లో షాపూర్‌జీ పల్లోంజీ కుటుంబానికి 18.37 శాతం వాటాలు ఉన్నాయి.   

Advertisement
 
Advertisement
Advertisement