Illegal bank accounts
-
నల్లధనమే లేకుండా చేస్తాం: జవదేకర్
-
నల్లధనమే లేకుండా చేస్తాం: జవదేకర్
న్యూఢిల్లీ: అక్రమ బ్యాంకు ఖాతాలు లేకుండా చేయాలని, ఈ దిశగా తమ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. విదేశాల్లో దాచిన నల్లధనాన్ని వెనక్కు రప్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. అసలు నల్లధనం లేకుండా చేయాలన్నదే తమ లక్ష్యమని ప్రకటించారు. ఇందుకోసం ఏమేం చేయాలో ఆలోచిస్తున్నామని చెప్పారు. మోదీ హయాంలో ఇది సాకారమవుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. విదేశాలకు తరలిన నల్లధనంలో ప్రతి పైసాను వెనక్కి తెస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన తర్వాత రోజే జవదేకర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
స్విస్ అభ్యంతరాలు చెబుతోంది: జైట్లీ
న్యూఢిల్లీ: అక్రమ బ్యాంకు ఖాతాల జాబితాను ఇవ్వాలని సిట్జర్లాండ్ను కోరితే.. ఆ దేశం న్యాయపర అభ్యంతరాలు లేవనెత్తుతోందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. శుక్రవారం లోక్సభలో స్విస్ బ్యాంక్ అకౌంట్లపై చర్చలో ఈ విషయం చెప్పారు. అయితే అక్రమ ఖాతాదారులకు సంబంధించి సాక్ష్యాలు సంపాదించేందుకు ఆ దేశం నుంచి ఖాతాల జాబితాను రప్పించడానికి ప్రయత్నిస్తామన్నారు. స్విస్ అధికారులతో సంప్రదింపుల నేపథ్యంలో ఆ దేశ న్యాయసూత్రాలను అనుసరించి ఒక ఒప్పందం కూడా చేసుకోబోతున్నామని వెల్లడించారు. స్వభావరీత్యా అది భవిష్యత్ ఖాతాలకు సంబంధించినది కావడంతో గత ఖాతాల వివరాలు వెల్లడించడానికి స్విట్జర్లాండ్ సహకరించడంలేదన్నారు.