
నల్లధనమే లేకుండా చేస్తాం: జవదేకర్
అక్రమ బ్యాంకు ఖాతాలు లేకుండా చేయాలని, ఈ దిశగా తమ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు.
న్యూఢిల్లీ: అక్రమ బ్యాంకు ఖాతాలు లేకుండా చేయాలని, ఈ దిశగా తమ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. విదేశాల్లో దాచిన నల్లధనాన్ని వెనక్కు రప్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.
అసలు నల్లధనం లేకుండా చేయాలన్నదే తమ లక్ష్యమని ప్రకటించారు. ఇందుకోసం ఏమేం చేయాలో ఆలోచిస్తున్నామని చెప్పారు. మోదీ హయాంలో ఇది సాకారమవుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. విదేశాలకు తరలిన నల్లధనంలో ప్రతి పైసాను వెనక్కి తెస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన తర్వాత రోజే జవదేకర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.