రాహుల్ భద్రతకు ఎప్పటికీ ముప్పే: షిండే | Sushilkumar Shinde says threat to Rahul Gandhi is permanent | Sakshi
Sakshi News home page

రాహుల్ భద్రతకు ఎప్పటికీ ముప్పే: షిండే

Oct 25 2013 3:42 PM | Updated on Aug 28 2018 7:22 PM

రాహుల్ భద్రతకు ఎప్పటికీ ముప్పే: షిండే - Sakshi

రాహుల్ భద్రతకు ఎప్పటికీ ముప్పే: షిండే

ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఎప్పటికీ ముప్పు పొంచి ఉంటుందని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల కుమార్ షిండే అన్నారు.

ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఎప్పటికీ ముప్పు పొంచి ఉంటుందని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల కుమార్ షిండే అన్నారు. ఆయన భద్రత కోసం అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని, ఎస్పీజీ రక్షణ కూడా కల్పిస్తున్నామని షిండే చెప్పారు. తన నాయనమ్మ, నాన్నల మాదిరిగా తనను కూడా ఏదో ఒకరోజు చంపుతారని రాహుల్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో మంత్రి స్పందించారు.

అంతకుముందు ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా స్పందిస్తూ రాహుల్కు పటిష్ట భద్రత కల్పిస్తామని చెప్పారు. దేశంలో రాజకీయాలకు దిగజారిపోతున్నందుకు తనతో పాటు అందరూ ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. బీజేపీ అధికారం కోసం విచ్ఛిన్న రాజకీయాలను ప్రేరేపిస్తోందని, ఇలాంటి రాజకీయాల వల్లే తన నాయనమ్మ, నాన్నను హత్య చేశారని రాహుల్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement