సుప్రీంకు దిగ్విజయ్ | Supreme Court to Digvijay | Sakshi
Sakshi News home page

సుప్రీంకు దిగ్విజయ్

Jul 5 2015 12:26 AM | Updated on Aug 14 2018 3:55 PM

సుప్రీంకు దిగ్విజయ్ - Sakshi

సుప్రీంకు దిగ్విజయ్

ఒకరి తరువాత ఒకరుగా నిందితులు అనుమానాస్పద పరిస్థితిలో మరణిస్తున్న మధ్యప్రదేశ్ వృత్తి పరీక్షల బోర్డు స్కాం(వ్యాపమ్)ను తక్షణం ....

ఒకరి తరువాత ఒకరుగా నిందితులు అనుమానాస్పద పరిస్థితిలో మరణిస్తున్న మధ్యప్రదేశ్ వృత్తి పరీక్షల బోర్డు స్కాం(వ్యాపమ్)ను తక్షణం సీబీఐ చేత విచారణ జరిపించాలని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ జూన్ 30న సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.

దేశంలోనే ఏ కేసులోనూ జరగని విధంగా ఇందరు నిం దితులు అనుమానాస్పదంగా మరణించడం ఆందోళనకరమనీ, అనధికార వార్తల ప్రకారం 40మంది చనిపోయినట్లు సమాచారముందని దిగ్విజయ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. హైకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సక్రమంగా విచారించలేకపోతున్నందువల్ల.. అత్యున్నత ధర్మాసనం పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరగాలని దిగ్విజయ్ కోరారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement