వరవరరావు కేసులో సుప్రీం తీర్పు రిజర్వ్‌

Supreme Court reserves verdict on five activist arrests - Sakshi

న్యూఢిల్లీ: కోరేగావ్‌–భీమా అల్లర్ల కేసులో గృహ నిర్బంధంలో ఉన్న వరవరరావుతో పాటు మరో నలుగురు సామాజిక కార్యకర్తలను విడుదల చేయాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. ప్రముఖ చరిత్రకారుడు రొమిల్లా థాపర్‌తో పాటు మరికొందరు సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషనర్, పోలీసుల తరఫు న్యాయవాదుల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది. ఈ కేసులో జరుగుతున్న విచారణకు సంబంధించి వివరాలను 24 లోపు తమ ముందుంచాలని మహారాష్ట్ర పోలీసులను ఆదేశించింది. వరవరరావు, అరుణ్‌ ఫెర్రీరా, వెర్నాన్‌ గొన్సాల్వేస్, సుధా భరద్వాజ్, గౌతం నవ్‌లఖాలు ఆగస్టు 29 నుంచి గృహ నిర్బంధంలో ఉన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top