సుప్రీం కోర్టులో కొత్త రోస్టర్‌

Supreme Court Judges Roster Made Public By CJI Misra - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు న్యాయమూర్తుల కేసు విచారణ రోస్టర్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా తొలిసారి బయటకు ప్రకటించారు. ఈ నెల 5వ తేదీ నుంచి విచారణకు స్వీకరించే కేసుల టేకప్‌కు సంబంధించి రోస్టర్‌ను ఆయన విడుదల చేశారు.

ఈ రోస్టర్‌లో కేవలం కొత్త కేసులకు మాత్రమే వర్తించనుంది. సుప్రీం కోర్టు వెబ్‌సైట్‌లో రోస్టర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి. కాగా, రోస్టర్‌ విధానంపై కొద్ది రోజుల క్రితం దేశ అత్యున్నత న్యాయస్థానంలో సంక్షోభం ఏర్పడిన విషయం తెలిసిందే.

కొత్త రోస్టర్‌ ప్రకారం.. సీజేఐ ప్రజాప్రయోజన వ్యాజ్యాలు, ఎన్నికల వివాదాల కేసులు, నేర సంబంధిత కేసులు, సామాజిక న్యాయానికి సంబంధించిన కేసులను విచారిస్తారు. అవసరమైన సమయంలో రాజ్యాంగ బెంచ్‌ను ఏర్పాటు చేస్తారు. ప్రత్యేక విచారణల నిమిత్తం విచారణ కమిషన్‌లను కూడా ఏర్పరుస్తారు.

సుప్రీం కోర్టులో నెంబర్‌ 2 సీనియర్‌ జడ్జిగా ఉన్న జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ కార్మిక, పరోక్ష పన్నులు, నేర సంబంధిత అంశాలు, వినియోగదారుల రక్షణ కేసులను విచారిస్తారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top