జస్టిస్‌ కర్ణన్‌కు ఆర్నెల్లు జైలుశిక్ష | Sakshi
Sakshi News home page

మరో మలుపు తిరిగిన జస్టిన్‌ కర్ణన్‌ వివాదం

Published Tue, May 9 2017 11:22 AM

జస్టిస్‌ కర్ణన్‌కు ఆర్నెల్లు జైలుశిక్ష - Sakshi

న్యూఢిల్లీ: కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిన్‌ కర్ణన్‌ వివాదం మరో మలుపు తిరిగింది. ఆయన వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం, కోర్టు ధిక్కరణ నేరం కింద కర్ణన్‌కు ఆరు నెలలు పాటు జైలుశిక్ష విధించింది. న్యాయస్థానం ఆదేశాల నేపథ్యంలో ఆయన్ని ఈరోజు అరెస్ట్‌ చేసే అవకాశం ఉంది.

కాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జేఎస్‌ ఖేహర్‌, మరో ఏడుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు జస్టిస్‌ కర్ణన్‌ అయిదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ ఎనిమిదిమంది ఎస్సీ, ఎస్టీ అత్యాచార చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరాలకు పాల్పడ్డారంటూ కర్ణన్‌ సంచలన తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న సుప్రీంకోర్టు ...జస్టిస్‌ కర్ణన్‌ కోర్టు థిక్కరణకు పాల్పడ్డారంటూ జైలుశిక్ష విధించింది.

తోటి హైకోర్టుల జడ్జిలపై ఆరోపణలు చేసినందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఖేహర్‌ నేతృత్వంలో ఏడుగురు జడ్జిల బెంచ్‌ కర్ణన్‌ను విచారించిన విషయం తెలిసిందే. విచారణ అనంతరం జడ్జిలతో కూడిన బెంచ్‌ దళితుడినని తనను అవమానించిందని కర్ణన్‌ ఆరోపించారు. తన కేసును సుమోటోగా తీసుకుని న్యాయపరమైన, చట్టపరమైన ఆదేశాలు జారీ చేసేందుకు అనర్హుడిని చేయడాన్ని ఆయన విమర్శించారు.



 

Advertisement
Advertisement