సుప్రీం కోర్టులో దినేష్‌రెడ్డికి చుక్కెదురు | Supreme court dismisses dinesh reddy petition | Sakshi
Sakshi News home page

సుప్రీం కోర్టులో దినేష్‌రెడ్డికి చుక్కెదురు

Oct 8 2013 1:00 AM | Updated on Sep 2 2018 5:20 PM

సుప్రీం కోర్టులో దినేష్‌రెడ్డికి చుక్కెదురు - Sakshi

సుప్రీం కోర్టులో దినేష్‌రెడ్డికి చుక్కెదురు

డీజీపీగా తన పదవీకాలం పొడిగింపునకు ఆదేశాలివ్వాలన్న దినేష్‌రెడ్డి అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

సాక్షి లీగల్ కరస్పాండెంట్, న్యూఢిల్లీ: డీజీపీగా తన పదవీకాలం పొడిగింపునకు ఆదేశాలివ్వాలన్న దినేష్‌రెడ్డి అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇదే విన్నపాన్ని తిరస్కరిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ (ఎస్‌ఎల్పీ)ను తోసిపుచ్చుతూ సోమవారం తీర్పు వెలువరించింది. తాను సెప్టెంబర్ 30న పదవీవిరమణ చేయాల్సి ఉన్నప్పటికీ ప్రకాశ్‌సింగ్ కేసు (2006)లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తన పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ దినేష్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను  ధర్మాసనం విచారించింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ దినేష్‌రెడ్డి పిటిషన్‌ను కొట్టివేసింది.

Advertisement
 
Advertisement
Advertisement