కార్తీ చిదంబరం విదేశీ పర్యటనకు సుప్రీం ఓకే

Supreme Court Allows Karti Chidambaram To Travel Abroad For Daughters Admission - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మనీ ల్యాండరింగ్‌ కేసులను ఎదుర్కొంటున్న సీనియర్‌ కాంగ్రెస్‌ నేత పీ చిదంబరం కుమరుడు కార్తీ చిదంబరానికి ఈనెల 20 నుంచి 31 వరకూ బ్రిటన్‌లో పర్యటించేందుకు మంగళవారం సుప్రీం కోర్టు అనుమతించింది. తన కుమార్తె అడ్మిషన్‌ కోసం కార్తీ చిదంబరం బ్రిటన్‌ పర్యటనకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

ఎయిర్‌సెల్‌-మ్యాక్సి్‌, ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసుల్లో కార్తీ చిదంబరం విచారణను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈడీ, సీబీఐలు కార్తీపై క్రిమినల్‌ కేసులను దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో విదేశీ పర్యటనల కోసం కార్తీకి న్యాయస్ధానం ఇచ్చిన స్వేచ్ఛను ఆయన దుర్వినియోగం చేశారని ఈడీ సర్వోన్నత న్యాయస్ధానానికి నివేదించింది.

కాగా విదేశాల్లో కార్తీ కొత్తగా బ్యాంకు ఖాతాను ప్రారంభించడం లేదా మూసివేయడం చేయరాదనే నిబంధన సహా పలు షరతులపై ఆయన విదేశీ పర్యటనకు కోర్టు అనుమతించింది. విమాన వివరాలు, భారత్‌కు తిరిగివచ్చే తేదీ వంటి వివరాలతో కార్తీ హామీ పత్రాన్ని సమర్పించాలని, స్వదేశానికి తిరిగి రాగానే తన పాస్‌పోర్ట్‌ను తిరిగి ఇచ్చేయాలని సుప్రీం బెంచ్‌ స్పష్టం చేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top