2011 నాటి ఏపీపీఎస్సీ గ్రూప్-1 కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తమ వైఖరి వెల్లడించేందుకు రెండు వారాల గడువు కావాలని సుప్రీం కోర్టును కోరింది.
న్యూఢిల్లీ: 2011 నాటి ఏపీపీఎస్సీ గ్రూప్-1 కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తమ వైఖరి వెల్లడించేందుకు రెండు వారాల గడువు కావాలని సుప్రీం కోర్టును కోరింది. ఇక ఆంధ్రప్రదేశ్ కోటాలో అభ్యర్థులకు పరీక్ష నిర్వహించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. సోమవారం సుప్రీం కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. జస్టిస్ అనిల్ ఆర్ దవే, జస్టిస్ ఉదయ్ కుమార్ గోయల్ తో కూడిన ధర్మాసనం వాదనలు వింది. మే 3న పూర్తి స్థాయి వాదనలు వింటామంటూ తదుపరి విచారణను వాయిదా వేసింది.
2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షలో ఆరు ప్రశ్నల్లో తప్పులున్నాయని అభ్యర్థులు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. మెయిన్స్కు అర్హత సాధించిన అభ్యర్థులకు మళ్ళీ పరిక్ష నిర్వహించాలని 2013లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. కాగా సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడంతో అభ్యర్థులు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.