నోట్ల రద్దుపై మోదీ సర్కార్‌కు సర్వే షాక్‌! | Support for demonetisation declining among citizens: Survey | Sakshi
Sakshi News home page

నోట్ల రద్దుపై మోదీ సర్కార్‌కు సర్వే షాక్‌!

Dec 12 2016 8:28 PM | Updated on Aug 15 2018 2:51 PM

నోట్ల రద్దుపై మోదీ సర్కార్‌కు సర్వే షాక్‌! - Sakshi

నోట్ల రద్దుపై మోదీ సర్కార్‌కు సర్వే షాక్‌!

పెద్ద నోట్ల రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందా? పొద్దున లేవగానే బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న సామాన్య ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీపై ఆగ్రహం వచ్చిందా?

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందా? పొద్దున లేవగానే బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న సామాన్య ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీపై ఆగ్రహం వచ్చిందా? అసలు నోట్ల రద్దు విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారు? కోపంగా ఉన్నారా? అసంతృప్తితో ఉన్నారా?అని ఓ సారి పరిశీలిస్తే.. ప్రజలు మాత్రం అసంతృప్తితోనే ఉన్నారని ఓ సర్వే తేల్చింది. పెద్ద నోట్ల రద్దుకు రానురాను మద్దతు తగ్గిపోతుందని ఆ సర్వే పేర్కొంది. లోకల్‌ సర్కిల్స్‌ అనే కొంతమంది పౌరులతో ఏర్పాటుచేసిన సంస్థ మొత్తం 8,526మందిని ప్రశ్నించి ఈ సర్వేను పూర్తి చేసింది.

ఈ సర్వే ప్రకారం ఈ పథకం అమలును ప్రస్తుతం 39శాతంమంది మాత్రమే అంగీకరిస్తున్నారని, 51శాతంమంది మాత్రం అసహనంతో ఉన్నారని, వారు మద్దతు ఇవ్వడం లేదని ఈ సర్వే పేర్కొంది. మూడు వారాల కిందట వీరంతా మద్దతిచ్చినవారేనని కూడా సర్వే వెల్లడించింది. ఈ పథకం సరిగా అమలు చేయడం లేదని మూడు వారాల కిందట 25శాతం మంది చెప్పగా ప్రస్తుతం అలా చెప్పేవారు 36శాతానికి పెరిగారని వివరించింది. ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి ఉండేదే కాదని చెప్పినట్లు పేర్కొంది. క్యూలో నిల్చున్నా తమకు రూపాయి దొరకని పరిస్థితుల్లో బడా బాబుల వద్ద కోట్లలో కొత్త నోట్లు బయటకు రావడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారని, బ్యాంకులు మోసాలకు పాల్పడ్డాయని వారు భావిస్తున్నారని కూడా సర్వే వివరించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement