సన్నీలియోన్‌ కండోమ్‌ యాడ్‌ దుమారం.. | Sunny Leone Condom Ad Runs Into Rough Weather | Sakshi
Sakshi News home page

సన్నీలియోన్‌ కండోమ్‌ యాడ్‌ దుమారం..

Sep 20 2017 10:29 AM | Updated on Aug 21 2018 2:30 PM

సన్నీలియోన్‌ కండోమ్‌ యాడ్‌ దుమారం.. - Sakshi

సన్నీలియోన్‌ కండోమ్‌ యాడ్‌ దుమారం..

నవరాత్రి సందర్భంగా గుజరాత్‌లో బాలీవుడ్‌ నటి సన్నీలియోన్‌తో ఏర్పాటుచేయించిన కండోమ్‌కు సంబంధించిన వాణిజ్య ప్రకటన హోర్డింగ్‌ వివాదాన్ని తీసుకొచ్చింది.

న్యూఢిల్లీ : నవరాత్రి సందర్భంగా గుజరాత్‌లో బాలీవుడ్‌ నటి సన్నీలియోన్‌తో ఏర్పాటుచేయించిన కండోమ్‌కు సంబంధించిన వాణిజ్య ప్రకటన హోర్డింగ్‌ వివాదాన్ని తీసుకొచ్చింది. అసభ్య చిత్రాల్లో నటించే సన్నీతో అలాంటి హోర్డింగ్‌ ఏర్పాటుచేసి హిందువుల మనోభావాలు దెబ్బకొట్టారంటూ, వాటిని వెంటనే తొలగించాలంటూ హిందూ యువ వాహిణి వంటి హిందూమత సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కేవలం డబ్బు సంపాధించడం లక్ష్యంగా చేసుకొని సన్నీలియోన్‌ భారతీయ విలువలను మంటగలుపుతోందంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. దీనికోసం పెద్ద మొత్తంలో ఆందోళనను కూడా లేవదీసింది. రోడ్లపైకి ఎక్కి నిరసన నినాదాలు చేసింది. గుజరాతీ భాషలో ఏర్పాటుచేసిన ఆ హోర్డింగ్‌లో

‘ఆ నవరాత్రి ఆ రామో, ప్రణతు ప్రేమ్‌తీ(జరుపుకోండి.. కానీ ప్రేమతో ఈ నవరాత్రిని’  అంటూ కండోమ్‌కు సంబంధించిన ఆ వాణిజ్య ప్రకటనలో రాశారు. అఖిల భారత వర్తక సమాఖ్య కూడా కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వన్‌కు ఓ లేఖ రాసింది. బాధ్యత రహితంగా ఏర్పాటుచేసిన ఆ హోర్డింగ్‌ను వెంటనే తొలగించేలా ఆదేశించాని కోరింది. దీనిపై మంత్రి వెంటనే చర్య తీసుకోవాలని, సదరు సంస్థపైనా, దానికి రాయబారిగా ఉన్న నటి సన్నీలియోనపైనా వెంటనే చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement