ముంబైలో హిట్ అండ్ రన్ | Speeding Mercedes Hits People Sleeping On Mumbai Pavement, 5 Injured | Sakshi
Sakshi News home page

ముంబైలో హిట్ అండ్ రన్

Jan 22 2016 11:54 AM | Updated on Sep 3 2017 4:07 PM

ముంబైలో హిట్ అండ్ రన్

ముంబైలో హిట్ అండ్ రన్

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో గురువారం అర్ధరాత్రి హిట్ రన్ అండ్ రన్ ఘటన జరిగింది.

ముంబై: దేశ వాణిజ్య రాజధాని ముంబైలో గురువారం అర్ధరాత్రి హిట్ రన్ అండ్ రన్ ఘటన జరిగింది. ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న వారిపై నుంచి మెర్సిడెజ్ బెంజ్ కారు దూసుకెళ్లింది. దక్షిణ ముంబైలోని మహ్మద్ అలీ రోడ్డులో అర్ధరాత్రి 12.15 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. వీరిలో నలుగురు మహిళలు, చిన్నారి ఉన్నారు. క్షతగాత్రులను జేజే ఆస్పత్రికి తరలించారు.

సంఘటనా స్థలం నుంచి పారిపోయిన కారు డ్రైవర్ ను తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. ఫుట్ పాత్ పైకి దూసుకొచ్చే ముందు మరో రెండు వాహనాలను కారు ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు. జార్ఖండ్ నంబర్ ప్లేటుతో ఉన్నట్టు ఈ కారు ఎవరిదో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, కారులో ఎంత మంది ఉన్నారనేది ఇంకా తెలియలేదని పోలీసు సీనియర్ అధికారి అశోక్ దూధే తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement