హిట్‌ అండ్‌ రన్‌ కేసుల్లో రూ.2 లక్షలు.. ఎలా పొందాలంటే? | Hit and run motor accident compensation claims | Sakshi
Sakshi News home page

హిట్‌ అండ్‌ రన్‌ కేసుల్లో రూ.2 లక్షలు.. ఎలా పొందాలంటే?

Oct 12 2026 9:38 AM | Updated on Oct 12 2026 10:35 AM

Hit and run motor accident compensation claims

శ్రీకాకుళం: కేంద్ర ప్రభుత్వం హిట్‌ అండ్‌ రన్‌ మోటారు యాక్సిడెంట్స్‌ పథకం కింద పరిహారం అందజేస్తోంది. మృతి చెందిన వారి కుటుంబానికి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు పరిహారం చెల్లిస్తోంది. దీని గురించి చాలా మందికి తెలియదు. దరఖాస్తు చేసుకుంటే సంబంధిత అధికారులు పరిశీలించి ప్రభుత్వ పరంగా పరిహారం ఇప్పిస్తారు. 

దరఖాస్తు ఇలా.. 
ఈ పథకం ద్వారా లబ్ధి పొందడానికి కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఫారం–1 లో వ్యక్తిగత వివరాలు, ప్రమాదం తీరు, ప్రాంతం, సమయం, గాయాల తీవ్రత, ఎఫ్‌ఐఆర్‌ పత్రం, ఆధార్‌ కార్డు, బ్యాంకు ఖాతా జిరాక్స్‌ జతచేయాలి. 

బాధితుడు మృతి చెందితే భార్య లేదా కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతా, మరణ ధ్రువీకరణ పత్రం, పోస్టుమార్టం నివేదికను పోలీసు, రెవెన్యూ అధికారులకు తెలియజేయాలి. 

క్షతగాత్రులు ఫారం–4 ద్వారా దర ఖాస్తు చేసుకోవాలి. వైద్య చికిత్సకు సంబంధించిన బిల్లులను జత చేయాలి. 

ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించే అవకాశం లేదని పోలీసులు రిపోర్టు ఇవ్వాల్సి ఉంటుంది. ఎఫ్‌ఐఆర్‌తో పాటు పూర్తి వివరాలను పోలీసులు నివేదిక రూపంలో అందించాలి. 

ఆర్డీఓ పరిశీలన అనంతరం కలెక్టర్‌కు అందజేస్తారు. 

పోలీసులు నివేదిక అందిన తర్వాత 15 రోజుల్లో తుది ఉత్తర్వులు ఇస్తారు. ఈ ప్రక్రియ పూర్తయితే సంబం«దీకుల బ్యాంకు ఖాతాల్లో పరిహా రం జమవుతుంది. 

హిట్‌ అండ్‌ రన్‌ కేసుల్లో మరణించినా, గాయపడినా కేంద్ర ప్రభుత్వం పరిహారం అందిస్తుంది. దీని కోసం దరఖాస్తు చేసుకుంటే నివేదికను ఆర్డీఓకు అందజేస్తామని సరుబుజ్జిలి ఎస్‌ఐ ఎస్‌.చిరంజీవి తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement