బ్రెజిల్ కు ప్రధాని మోదీ థ్యాంక్స్ | Special gratitude to the Brazil for hosting Rio olympics | Sakshi
Sakshi News home page

బ్రెజిల్ కు ప్రధాని మోదీ థ్యాంక్స్

Aug 22 2016 8:53 AM | Updated on Aug 15 2018 2:30 PM

బ్రెజిల్ కు ప్రధాని మోదీ థ్యాంక్స్ - Sakshi

బ్రెజిల్ కు ప్రధాని మోదీ థ్యాంక్స్

రియో ఒలింపిక్స్ ను బ్రెజిల్ చిరస్మరణీయంగా నిర్వహించిందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు.

న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ ను బ్రెజిల్ చిరస్మరణీయంగా నిర్వహించిందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన క్రీడాకారులకు ఘనమైన ఆతిథ్యం ఇచ్చినందుకు బ్రెజిల్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రియో ఒలింపిక్స్ ముంగిపు వేడుకలు అద్భుతంగా నిర్వహించారని మెచ్చుకున్నారు.

ఒలింపిక్స్ లో పాల్గొన్న అథ్లెట్లు అందరికీ ట్విట్టర్ ద్వారా ఆయన అభినందనలు తెలిపారు. రియో ఒలింపిక్స్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన క్రీడాకారులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు. కాగా, రియో ఒలింపిక్స్ ముగిసినట్టు అంతర్జాతీయ ఒలింపిక్స్ సమాఖ్య అధ్యక్షుడు థామస్ బాచ్ అధికారికంగా ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement