ప్రత్యేక విమానంలో బ్రిటీష్‌ పౌరుల తరలింపు | Special flight evacuates 250 British nationals from Amritsar | Sakshi
Sakshi News home page

ప్రత్యేక విమానంలో బ్రిటీష్‌ పౌరుల తరలింపు

Apr 23 2020 3:31 PM | Updated on Apr 23 2020 3:34 PM

Special flight evacuates 250 British nationals from Amritsar - Sakshi

అమృత్‌సర్‌ : లాక్‌డౌన్‌ కారణంగా భారత్‌లో చిక్కుకుపోయిన 250 మంది బ్రిటీష్‌ పౌరులను గురువారం ప్రత్యేక విమానంలో లండన్‌కు తరలించారు. అమృత్‌సర్‌లోని శ్రీ గురు రామ్‌ దాస్‌ జీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన ప్రత్యేక విమానంలో బ్రిటీష్‌ పౌరులను తరలించారు. కోవిడ్-19 మహమ్మారిని నిరోధించడంలో భాగంగా అమలవుతున్న లాక్‌డౌన్‌ వల్ల చిక్కుకుపోయినవారిని తిరిగి బ్రిటన్‌కు రప్పించేందుకు మరొక 17 ప్రత్యేక విమానాలను నడుపుతామని గత వారం బ్రిటిష్ హైకమిషన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో 25, 27 తేదీల్లో కూడా విమానాలను నడుపుతామని హై కమిషన్  పేర్కొంది.

భారత దేశంలో బ్రిటన్ తాత్కాలిక హై కమిషనర్ జే థాంప్సన్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం, స్థానిక అధికారులు అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. ఎక్కువ మంది చిక్కుకున్న ప్రాంతాల నుంచి విమానాలను నడిపేందుకు తాము నిరంతరం కృషి చేస్తున్నామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement