స్మృతికి మళ్లీ చిక్కులు.. ఫేక్‌ డిగ్రీ కేస్‌ రిటర్న్‌ | Smriti Irani Fake Degree Row Back? High Court Asks For Records | Sakshi
Sakshi News home page

స్మృతికి మళ్లీ చిక్కులు.. ఫేక్‌ డిగ్రీ కేస్‌ రిటర్న్‌

May 23 2017 4:33 PM | Updated on Aug 31 2018 8:34 PM

స్మృతికి మళ్లీ చిక్కులు.. ఫేక్‌ డిగ్రీ కేస్‌ రిటర్న్‌ - Sakshi

స్మృతికి మళ్లీ చిక్కులు.. ఫేక్‌ డిగ్రీ కేస్‌ రిటర్న్‌

మరోసారి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ విద్యార్హతలకు సంబంధించిన కేసు తెరమీదకు వచ్చింది. కిందిస్థాయి కోర్టులో ఆమెకు ఉపశమనం లభించినా హైకోర్టులో మాత్రం కేసు విచారణ మళ్లీ మొదలైంది.

న్యూఢిల్లీ: మరోసారి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ విద్యార్హతలకు సంబంధించిన కేసు తెరమీదకు వచ్చింది. కిందిస్థాయి కోర్టులో ఆమెకు ఉపశమనం లభించినా హైకోర్టులో మాత్రం మరోసారి ఈ కేసు విచారణ మొదలైంది. ఆమె విద్యార్హతలకు సంబంధించిన పత్రాలన్ని కోర్టుకు సమర్పించాలంటూ స్పష్టం చేసింది. వాటిని పరిశీలించిన తర్వాతే ఎవరికి సమన్లు ఇవ్వాలనే విషయం నిర్ణయిస్తామని తెలిపింది.

ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన అఫిడవిట్‌లో తాను డిగ్రీ పూర్తి చేసినట్లు స్మృతి ఇరానీ పేర్కొన్నారని, వాస్తవానికి ఆమె డిగ్రీ పూర్తి చేయలేదని, కరస్పాండెన్స్‌ కోర్సు ద్వారా బ్యాచిలర్‌ ఆఫ్‌ కామర్స్‌లో ఉన్నారని, అది పూర్తి చేయలేదని, తప్పుడు వివరాలు ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ అహ్మద్‌ ఖాన్‌ అనే వ్యక్తి కిందిస్థాయి కోర్టులో ఫిటిషన్‌ వేయగా ఆ కోర్టు తోసిపుచ్చింది. దీంతో అతడు హైకోర్టుకు వెళ్లగా విచారణకు స్వీకరించిన కోర్టు స్మృతి ఇరానీ విద్యార్హత రికార్డులు ఇవ్వాలని ఆదేశించింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement