పడవ బోల్తా.. ఆరుగురి మృతి | Six die as boat capsizes in Bihar | Sakshi
Sakshi News home page

పడవ బోల్తా.. ఆరుగురి మృతి

Nov 1 2014 3:09 PM | Updated on Apr 3 2019 5:24 PM

బీహార్లో పడవ బోల్తా పడిన సంఘటనలో కనీసం ఆరుగురు మరణించగా, మరో ఐదుగురి ఆచూకీ తెలియడం లేదు.

పాట్నా: బీహార్లో పడవ బోల్తా పడిన సంఘటనలో కనీసం ఆరుగురు  మరణించగా, మరో ఐదుగురి ఆచూకీ తెలియడం లేదు. మరణించిన వారిలో ముగ్గురు పిల్లలు ఉన్నారు.  శనివారం బీహార్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన జముయ్ జిల్లాలోని గాహి డ్యామ్లో ఈ ప్రమాదం జరిగింది.

16 మందిని తీసుకువెళ్తున్న పడవ డ్యామ్లో బోల్తాపడినట్టు పోలీసులు తెలిపారు. వీరిలో ఐదుగురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. చనిపోయిన ఆరుగురి మృతదేహాలను గ్రామస్తుల సాయంతో వెలికితీసినట్టు పోలీసులు తెలిపారు. గల్లంతయిన ఐదుగురిని కాపాడేందుకు గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement