ఈ రోడ్డు చాలా ‘హైట్‌’ గురూ...

Sikkim To Get World Second Highest Motorable Road - Sakshi

గ్యాంగ్‌టక్‌ : సిక్కింలోని కెరంగ్‌-జొడాంగ్‌ల మధ్య 18,600 అడుగుల ఎత్తులో 19 కిలోమీటర్ల పొడవైన రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇది పూర్తయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రెండో రహదారిగా నిలుస్తుంది. 2021కల్లా రోడ్డు నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సరిహద్దు రోడ్ల సంస్థ (బీఆర్‌ఓ) అధికారి తెలిపారు. 2015లో మంజూరైన ఈ ప్రాజెక్టులో  ప్రస్తుతం కొండలను తవ్వే కార్యక్రమాన్ని పూర్తి చేశారు. రోడ్డు 3.75 మీటర్ల వెడల్పు ఉంటుందని పేర్కొన్నారు. ఈ ప్రాంతం టూరిజం పరంగా అభివృద్ధి చెందుతున్నందున సాధారణ పౌరులు తిరిగేందుకు కూడా ఆర్మీ అనుమతించే అవకాశం ఉందని తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top