ఆ వీడియోలో ఉంది సిద్ధరామయ్యేనా? | Siddaramaiah Dance Video Viral in Social Media | Sakshi
Sakshi News home page

Mar 11 2018 1:34 PM | Updated on Mar 11 2018 1:39 PM

Siddaramaiah Dance Video Viral in Social Media - Sakshi

వీడియోలోని దృశ్యాలు

సాక్షి, బెంగళూర్‌ : సోషల్‌ మీడియాలో ఇప్పుడు ఓ వీడియో వైరల్‌ అవుతోంది. తనదైన వ్యవహార శైలితో నిత్యం వార్తల్లో హాట్‌ టాపిక్‌గా నిలుస్తున్నారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య. ఆయనకు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు.  అలాంటిది ఆయన పేరిట డాన్స్‌  వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది. 

ఆయన హుషారుగా డాన్స్‌ చేశారంటూ ఓ వీడియో వైరల్‌ అవుతుంది. చౌక సినిమాలోని బ్లాక్‌ బస్టర్‌ సాంగ్‌ అల్లాడ్సు.. అల్లాడ్సు సాంగ్‌పై వీడియోలో ఉన్న పెద్దాయన హుషారుగా గంతులేయటం చూడొచ్చు. అది పాతదో.. కొత్తదో.. తెలీదు, అసలు అందులో ఉంది సిద్ధారామయ్య అన్నది కూడా గ్యారెంటీ లేదు(పంచె కట్టు, వేషాధారణ మాత్రం అలాగే ఉంది). ఎక్కడి నుంచి ఇది వైరల్‌ అవుతుందో స్పష్టత లేదు.

అయినా సీఎం సిద్ధారామయ్య చిందుల పేరిట ఆ వీడియో ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఫేక్‌ వీడియోతో పరువు తీస్తున్నారని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం అది ఆయనేనంటూ వైరల్‌ చేస్తున్నారు.  వీడియోకు కామెంట్లు మాత్రం కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement