కాంగ్రెస్‌ పార్టీకి ఆమె ఓ గుదిబండ | Sheila Dikshit is a burden on Congress: Arvinder Singh Lovely | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ పార్టీకి ఆమె ఓ గుదిబండ

Apr 19 2017 8:06 PM | Updated on Mar 29 2019 9:31 PM

కాంగ్రెస్‌ పార్టీకి ఆమె ఓ గుదిబండ - Sakshi

కాంగ్రెస్‌ పార్టీకి ఆమె ఓ గుదిబండ

కాంగ్రెస్‌ పార్టీకి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ ఓ గుదిబండ అని బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీ ఢిల్లీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అరవింద్‌ సింగ్‌ లవ్‌లీ అన్నారు.

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీకి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ ఓ గుదిబండ అని బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీ ఢిల్లీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అరవింద్‌ సింగ్‌ లవ్‌లీ అన్నారు. మంగళవారం కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పి ఢిల్లీ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అమిత్‌ మాలిక్‌తో కలిసి అమిత్‌ షా సమక్షంలో బీజేపీలో చేరిన ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ..

‘మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఢిల్లీ ఎన్నికల ప్రచారం నుంచి షీలా దీక్షిత్‌ పూర్తిగా పక్కకు తప్పుకొని కాంగ్రెస్‌కు భారంగా మారారు. నేను సైనికుల అభీష్టాలకు అనుగుణంగా పనిచేస్తున్న బీజేపీలో చేరాలని నేను నిర్ణయించుకున్నాను. ఢిల్లీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అజయ్‌ మాకెన్‌ ఆయన సుభిక్షంగా ఉండేందుకు ప్రాముఖ్యతనిస్తారు. కష్టపడేందుకు అస్సలు ఇష్టపడరు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్‌ తివారీ మురిగి వాడల్లో రాత్రంతా గడుపుతున్నారు. వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మాకెన్‌ మాత్రం లోది గార్గెన్‌లో ప్రచారం చేసి వెంటనే ఇంటికి వెళ్లిపోతున్నారు. అసలు ఆయన ఏం చేస్తున్నారో ఒకసారి ఆలోచించుకుంటే మంచింది. బీజేపీ దేశానికి దిశానిర్దేశం చేస్తోంది. నరేంద్రమోదీ, అమిత్‌ షా నాయకత్వంలో రాజకీయాలకు కొత్త నిర్వచనం చెబుతోంది’ అని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement