ఆకాశాన్నంటిన ఉల్లి ధరల్ని అదుపు చేయడంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ చేతులెత్తేశారు.
ఆకాశాన్నంటిన ఉల్లి ధరల్ని అదుపు చేయడంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ చేతులెత్తేశారు. మరో 2-3 వారాల పాటు ధరలు తగ్గవని చెప్పారు. అక్రమ నిల్వదారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించారు. బుధవారమిక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి ఉల్లి ధరలపై స్పందించారు. ప్రస్తుతం ఉల్లి ధర కిలో 80 నుంచి 90 రూపాయల దాకా పలుకుతోంది.
ఉల్లి ధరను నియంత్రించడానికి పరిష్కారం కనుగోవాల్సివుందని పవార్ అన్నారు. రెండు మూడు వారాల్లో ధరలు తగ్గుతాయా అన్న ప్రశ్నకు.. తానేమీ జ్యోతిష్కుడిని కాదని బదులిచ్చారు. ఐతే పంటల దిగుబడి సమాచారం, సొంత నివేదిక మేరకు రెండు మూడు వారాలు ధరలు భారీ స్థాయిలో ఉంటాయని పవాన్ చెప్పారు.