సీనియర్‌ జర్నలిస్టు కన్నుమూత | Senior journalist Nilkanth Khadilkar dead    | Sakshi
Sakshi News home page

సీనియర్‌ జర్నలిస్టు కన్నుమూత

Nov 22 2019 10:21 AM | Updated on Nov 22 2019 10:44 AM

Senior journalist Nilkanth Khadilkar dead    - Sakshi

సాక్షి, ముంబై : ప్రముఖ, సీనియర్ జర్నలిస్ట్ నీల్‌కంఠ్‌ ఖాదిల్కర్  (85) అనారోగ్యంతో కన్నుముశారు. సబర్బన్ బాంద్రాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన శుక్రవారం మరణించినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి.  మరాఠీ వార్తాపత్రిక ‘నవకాల్‌’ కు సంపాదకుడిగా 27 సంవత్సరాలుగా తన విశేష సేవలందిస్తున్నారు.  తన పదునైన సంపాదకీయాలతో ప్రజాదరణ పొందారు. "ప్రాక్టికల్ సోషలిజం’’,  ‘‘రష్యా పర్యటన విశేషాలు" లాంటి పుస్తకాలను ఆయన రచించారు. 


 పద్మశ్రీ జీ జీ జాదవ్‌  మెమోరియల్‌ అవార్డు తీసుకుంటున్న నీల్‌కంఠ్‌  ఖాదిల్కర్ (ఫైల్‌ ఫోటో)

Advertisement
 
Advertisement
Advertisement