బట్టలూడదీసి కొడతా..! | Sena MLA's strip comment: Women activists demand stringent action | Sakshi
Sakshi News home page

బట్టలూడదీసి కొడతా..!

Jul 3 2014 11:17 PM | Updated on Oct 5 2018 9:09 PM

బట్టలూడదీసి కొడతానంటూ ఓ మహిళకు వార్నింగ్ ఇచ్చాడనే ఆరోపణలపై శివసేన ఎమ్మెల్యే ప్రకాశ్ బాలా సావంత్‌పై కేసు నమోదైంది.

ముంబై: బట్టలూడదీసి కొడతానంటూ ఓ మహిళకు వార్నింగ్ ఇచ్చాడనే ఆరోపణలపై శివసేన ఎమ్మెల్యే ప్రకాశ్ బాలా సావంత్‌పై కేసు నమోదైంది. బాంద్రా శివారు ప్రాంతాల్లోని ఓ హౌసిం గ్ సొసైటీ పునరాభివృద్ధి విషయమై జరిగిన వాగ్వాదంలో సహనం కోల్పోయిన సావంత్ ఈ వాఖ్యలు చేసినట్లు ఖేర్వాడీ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

బాధితురాలి ఫిర్యాదుమేరకు సావంత్‌పై భారత శిక్షాస్మృతి, సెక్షన్లు 540(అవమాన పర్చాలనే ఉద్దేశంతో దుర్బాషలాడడం), 506 (బెదిరించడం), 509 (మహిళను కించపర్చడం) ప్రకారం కేసు నమోదు చేసినట్లు సీని యర్ ఇన్‌స్పెక్టర్ అశోక్ కదమ్ తెలిపారు. గాంధీనగర్ హౌసింగ్ సొసైటీలో 36 హౌసింగ్ బోర్డ్ భవనాలున్నాయి. ఇక్కడ గత కొంతకాలంగా పునరాభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ హౌసింగ్ సొసైటీలో ఉన్న పలు సంఘాల మధ్య సఖ్యత కొరవడడం, అభివృద్ధి పనుల కోసం బిల్డర్‌ను ఎంపిక చేసే విషయంలో ఇరు గ్రూపుల మధ్య విభేదాలు కొంతకాలంగా కొనసాగుతున్నాయి.

 ఇదే హౌసింగ్ సొసైటీలో ఎమ్మెల్యే కూడా ఉంటున్నారు. కాగా సోమవారం బాధితురాలిని పిలిచి ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చాడని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసు లు నిజానిజాల నిగ్గు తేల్చేందుకు దర్యాప్తు ప్రారంభించారు. సాక్ష్యాధారాల కోసం ప్రయత్నిస్తున్నట్లు కదమ్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement