గుజరాత్‌లో జరిగిన స్కూల్ బస్సు ప్రమాదంలో 20 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
- 20 మందికి తీవ్ర గాయాలు
- సగం మంది పరిస్థితి విషమం
గాంధీనగర్ : సుమారు 30 మంది విద్యార్థులను తీసుకుని వెళ్తున్న ఒక స్కూల్ బస్సును ఎదురుగా వస్తున్న ఒక ట్రక్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో 20మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. మరో సగంమంది పరిస్థితి తీవ్రంగా ఉంది. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఉదయం 7.30 నిమిషాలకు గుజరాత్‌లోని సర్కంజ్ గ్రామం నుంచి 30 విద్యార్థులను తీసుకుని మేమ్‌నగర్‌లో ఉన్న దివ్యపథ్ పాఠశాలకు బస్సు బయలు దేరింది. గ్రామం నుంచి కొద్దదూరం ప్రయాణించాక.. నవాపుర సర్కిల్ వద్ద (సర్కంజ్‌కు 7 కి.మీ దూరంలో) బస్సును ఒక ట్రక్‌ఢీ కొట్టింది. ఈ ఘటనలో 20 మంది విద్యార్థులు తీవ్ర గాయాలపాలయ్యారు. అందులో పదిమంది పరిస్థితి విషమంగా ఉంది.
విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సుకు ప్రమాదం జరిగిందని పాఠశాల యాజమాన్యం తెలిపింది. గాయపడ్డ విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అన్నిరకాలుగా సహకరిస్తామని యాజమాన్యం తెలింది.