‘డ్యాన్స్‌ వస్తే చాలు.. కాంగ్రెస్‌లో ఛాన్స్‌’ | Sapna Chaudhary Reaction On BJP MP Ashwini Chopra Thumke Wale Comments | Sakshi
Sakshi News home page

Jun 26 2018 9:55 AM | Updated on Mar 29 2019 8:30 PM

Sapna Chaudhary Reaction On BJP MP Ashwini Chopra Thumke Wale Comments - Sakshi

సప్నా చౌదరి, బీజేపీ ఎంపీ అశ్వినీ కుమార్‌ చోప్రా

చండీగఢ్‌ : తనను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ అశ్వినీ కుమార్‌ చోప్రాకు, హర్యానా సింగర్‌ కమ్‌ డాన్సర్‌ సప్నా చౌదరి గట్టి కౌంటర్‌ ఇచ్చారు. ‘నా డ్యాన్స్‌ పోగ్రామ్స్‌ చూస్తున్నందుకు అశ్వినీ కుమార్‌కు ధన్యవాదాలు, అయినా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా మీ మానసిక స్థితి ఎలా ఉందో అర్థమైపోతోంది’ అంటూ సప్నా చౌదరి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ‘ప్రేక్షకులకు వినోదాన్ని పంచడమే నా కర్తవ్యం. ఇకపై కూడా నా కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించేందుకు నేను ఏమాత్రం వెనుకాడబోను. దీంట్లో ఎటువంటి మార్పు ఉండదు’ అంటూ ఆమె స్పష్టం చేశారు. అయినా వయసులో తన కంటే పెద్దవారి నుంచి క్షమాపణలు కోరడమనేది సంస్కారం అనిపించుకోదన్నారు.

అసలు విషయమేమిటంటే....
సింగర్‌, డ్యాన్సర్‌గా సప్నా చౌదరికి ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ.. సప్నా చౌదరితో క్యాంపెయిన్‌ నిర్వహించేందుకు ఆసక్తి చూపుతోందని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా సప్నా చౌదరి, యూపీఏ చీఫ్‌ సోనియా గాంధీని కలిసేందుకు గత శుక్రవారం ఢిల్లీకి వెళ్లడంతో ఆమె కాంగ్రెస్‌ పార్టీలో చేరుతోందనే ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ అశ్వినీ కుమార్‌ చోప్రా మీడియాతో మాట్లాడుతూ... ‘డ్యాన్స్‌ చేయడం వస్తే చాలు కాంగ్రెస్‌ పార్టీలో సెటిల్‌ అవ్వొచ్చు అనుకునే వారు చాలా మందే ఉన్నారు. అయినా కాంగ్రెస్‌ పార్టీలో ఇప్పటికే డ్యాన్సర్లు ఎక్కువైపోయారు. అసలు ఆ పార్టీ ఏం కోరుకుంటోంది...? ఎన్నికల్లో గెలవాలనా లేదా డ్యాన్సర్లతో పార్టీని నింపేయాలనా’ అంటూ వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement