‘సాక్షి’ ఉద్యోగి సైమన్ మృతి | Sakshi Employee Simon dies from heart attack | Sakshi
Sakshi News home page

‘సాక్షి’ ఉద్యోగి సైమన్ మృతి

Aug 16 2013 5:32 AM | Updated on Aug 20 2018 8:20 PM

‘సాక్షి’ దినపత్రిక చెన్నై యూనిట్ అసిస్టెంట్ ప్రొడక్షన్ మేనేజర్ సైమన్ (50) గుండెపోటుతో బుధవారం కన్నుమూశారు. ఛాతీనొప్పితో సోమవారం చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన బుధవారం రాత్రి పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు.

చెన్నై, న్యూస్‌లైన్: ‘సాక్షి’ దినపత్రిక చెన్నై యూనిట్ అసిస్టెంట్ ప్రొడక్షన్ మేనేజర్ సైమన్ (50) గుండెపోటుతో బుధవారం కన్నుమూశారు. ఛాతీనొప్పితో సోమవారం చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆయన బుధవారం రాత్రి పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. సైమన్ భౌతికకాయాన్ని స్వగ్రామం విల్లుపురం జిల్లా దిండివనానికి తరలించారు. సైమన్ సతీమణి ఇటీవలే మరణించారు. ఆయనకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. సాక్షి ప్రారంభంలో నెల్లూరు యూ నిట్‌లో పనిచేసిన సైమన్ ఆ తర్వాత చెన్నై యూనిట్ కు బదిలీ అయ్యారు. భౌతికకాయానికి గురువారం క్రైస్తవ సంప్రదాయంలో అంత్యక్రియలు జరిగాయి.

Advertisement
 
Advertisement
Advertisement