జవాను సునీల్ రాయ్ మృతదేహం లభ్యం | Rescuers on Saturday found the body of Rifleman Sunil Rai | Sakshi
Sakshi News home page

జవాను సునీల్ రాయ్ మృతదేహం లభ్యం

Mar 26 2016 6:12 PM | Updated on Sep 3 2017 8:38 PM

జమ్ముకశ్మీర్ సియాచిన్లో మంచు తుపానులో గల్లంతు అయిన జవాను సునీల్ రాయ్ మృతదేహం లభ్యమైంది.

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ సియాచిన్లో మంచు తుపానులో గల్లంతు అయిన జవాను సునీల్ రాయ్ మృతదేహం లభ్యమైంది. సియాచిన్ తుర్టక్ సెక్టార్ లడక్‌లో ఆర్మీ గస్తీ బృందంపై హిమపాతం పడటంతో ఒక జవాను మృతిచెందగా, మరో జవాను నిన్న గల్లంతు అయిన విషయం తెలిసిందే. గాలింపు చర్యల్లో భాగంగా సునీల్ రాయ్ మృతదేహాన్ని గుర్తించినట్లు ఆర్మీ అధికారి ఒకరు శనివారం తెలిపారు.
 
 
మృతి చెందిన సునీల్ రాయ్కు తల్లిదండ్రులతో పాటు ఇద్దరు సోదరులు ఉండగా, ఇక తమాంగ్కు భార్య, ఆరేళ్ల కుమార్తె ఉన్నారు. ఇద్దరు జవాన్ల కుటుంబాలకు ఆర్మీ కమాండర్, లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హుడా తన సంతాపాన్ని ప్రకటించారు. గత నెలలో సియాచిన్ గ్లేసియర్‌లో హిమపాతం దెబ్బకు లాన్స్ నాయక్ హనుమంతప్పతో పాటు పది మంది సైనికులు మత్యు ఒడికి చేరిన విషయం తెలిసిందే.

 

Advertisement
 
Advertisement
Advertisement