పెట్రోలు పోసే మెషీన్ నూ లాగేసుకు వెళ్లిన కారు | Rash driving leads to freak accident in Delhi | Sakshi
Sakshi News home page

పెట్రోలు పోసే మెషీన్ నూ లాగేసుకు వెళ్లిన కారు

Jul 12 2014 7:54 PM | Updated on Sep 3 2019 9:06 PM

పెట్రోలు పోసే మెషీన్ నూ లాగేసుకు వెళ్లిన కారు - Sakshi

పెట్రోలు పోసే మెషీన్ నూ లాగేసుకు వెళ్లిన కారు

ఢిల్లీలోని వసంతకుంజ్ లో ఓ కారు పెట్రోల్ బంక్ లో పెట్రోలు నింపుకుని వెళ్తున్న ఓ కారు పొరబాటుగా పెట్రోల్ పోసే పైప్ ను కూడా లాగేయడంతో మొత్తం పెట్రోల్ పోసే మెషీన్ కూడా ఊడి వచ్చేసింది. దీంతో భారీ అగ్నిప్రమాదం జరిగింది

ఢిల్లీలోని వసంతకుంజ్ లో ఓ కారు పెట్రోల్ బంక్ లో పెట్రోలు నింపుకుని వెళ్తున్న ఓ కారు పొరబాటుగా పెట్రోల్ పోసే పైప్ ను కూడా లాగేయడంతో మొత్తం పెట్రోల్ పోసే మెషీన్ కూడా ఊడి వచ్చేసింది. దీంతో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ సంఘటన శనివారం జరిగింది.
 
దీంతో పెట్రోల్ మొత్తం బంక్ అంతా పాకి ఉన్నట్టుండి భగ్గుమంది. ఈ ప్రమాదంలో ఒక ఉద్యోగి గాయపడ్డాడు. మిగిలిన వారు మాత్రం ఎలాంటి ప్రమాదమూ లేకుండా బయటపడ్డారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగడంతో మంటలు విస్తరించలేదు. ఒక వేళ పెట్రోలు నిలువ ఉంచే ట్యాంకు వరకూ మంటలు వ్యాపించి ఉంటే ఎన్నో ప్రాణాలు ఆవిరైపోయి ఉండేవి. 
 
నిర్లక్ష్యంగా కారు నడిపిన వ్యక్తి తాలూకు చిత్రాలు, కారు నంబరు బంకులోని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయని సిబ్బంది చెప్పారు. ఇప్పుడు పోలీసులు ఆ కారు యజమాని కోసం వెతుకుతున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement