దెయ్యం వదిలిస్తానని... అత్యాచారం చేశాడు | raped exorcism doctor in bhiwandi | Sakshi
Sakshi News home page

దెయ్యం వదిలిస్తానని... అత్యాచారం చేశాడు

Jan 8 2015 10:45 PM | Updated on Aug 20 2018 4:35 PM

దెయ్యం వదిలిస్తానని... అత్యాచారం చేశాడు - Sakshi

దెయ్యం వదిలిస్తానని... అత్యాచారం చేశాడు

కూతురికి పట్టిన దెయ్యాన్ని వదిలిస్తానని, తల్లిపై అత్యాచారం చేసిన భూత వైధ్యుడిని గణేష్‌పురి పోలీసులు బుధవారం రాత్రి అరెస్టు చేశారు.

భివండీ, న్యూస్‌లైన్:  కూతురికి పట్టిన దెయ్యాన్ని వదిలిస్తానని, తల్లిపై అత్యాచారం చేసిన భూత వైధ్యుడిని గణేష్‌పురి పోలీసులు బుధవారం రాత్రి అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం... గణేష్‌పురి ప్రాంతంలో నివాసముంటున్న ప్రభాకర్ పాటిల్ (50) భూత వైధ్యుడు. అదే ప్రాంతానికి చెందిన ఓ వివాహిత నవంబర్ నెలలో ప్రభాకర్ ఇంట్లో పని మనిషిగా చేరింది. ఆమెకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆమె కుమారునికి ఫిట్స్ వ్యాధి ఉందని బాధ పడుతున్న ఆమెను, ‘‘నీ కూతురికి భూతం పట్టింది, దాని నుంచి విముక్తి కలిగిస్తాను.
 
 అమావాస్య రోజు రాత్రి తీసుకురమ్మ’’ని చెప్పాడు. వైద్యం చేయించడానికి డ బ్బు లేని ఆ పేదరాలు తన కూతురిని తీసుకుని పోయింది. బాలిక నిద్రపోగా, తల్లి కాళ్లు, చేతులు కట్టేసి మంత్రాలు చదివినట్లుగా నటిస్తూ ఆమెపై అత్యాచారం చేశాడని బాధితురాలు చెప్పింది. ఆ తరువాత ఇలా ఏదో వంకతో ఇంటికి రప్పించుకుని కొద్ది రోజులుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడని బాధితురాలు స్థానిక గణేష్‌పురి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో అతడిని అరెస్టు చేసి కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement