రజనీకాంత్ కన్నా సుదీప్ ఉత్తమం | Ram Gopal Varma takes a dig at Rajinikanth again, faces flak from fans | Sakshi
Sakshi News home page

రజనీకాంత్ కన్నా సుదీప్ ఉత్తమం

Aug 19 2016 3:09 AM | Updated on Apr 3 2019 8:56 PM

రజనీకాంత్ కన్నా సుదీప్ ఉత్తమం - Sakshi

రజనీకాంత్ కన్నా సుదీప్ ఉత్తమం

దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కన్నడ స్టార్ నటుడు సుదీప్ నటనను మెచ్చుకునే క్రమంలో చేసిన ట్వీట్ దుమారం రేపింది.

సాక్షి,బెంగళూరు: దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కన్నడ స్టార్ నటుడు సుదీప్ నటనను మెచ్చుకునే క్రమంలో చేసిన ట్వీట్ దుమారం రేపింది. దివంగత కన్నడ నటుడు విష్ణువర్ధన్‌తోపాటు సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై చేసిన వ్యాఖ్యలు కన్నడిగుల ఆగ్రహానికి కారణమయ్యాయి. ఇటీవల విడుదలైన కిచ్చా సుదీప్ సినిమా ‘కోటిగొబ్బ-2’ని వీక్షించిన వర్మ ట్విటర్‌లో .. ‘రజనీకాంత్ కేవలం స్టైల్‌తో నెగ్గుకొస్తున్నారు. ఆయన ఎంత యత్నించినా ఈగ సినిమాలో సుదీప్ పాత్రను పోషించలేరు. ‘కోటిగొబ్బ-2’లో సుదీప్ నటనతో పోల్చితే ‘కోటిగొబ్బ-1’లో విష్ణువర్ధన్ సరిగా చేయలేదు’ అన్నారు. వర్మ ట్వీట్‌కు ప్రతిస్పందించిన సుదీప్.. విష్ణు, రజనీ వంటి దిగ్గజాలతో నన్ను పోల్చడం భావ్యం కాదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement